బాలకృష్ణ కోసం కొత్త కథ రెడీ చేసిన గోపీచంద్
- February 24, 2021హైదరాబాద్:ఈ ఏడాది మొదట్లోనే క్రాక్ సినిమాతో భారీ హిట్ అందుకున్నారు దర్శకుడు గోపీచంద్ మలినేని. క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అతడికి వరుస అవకాశాలు వచ్చాయి. వాటిలో నందమూరి బాలకృష్ణ తో కూడా అవకాశం లభించింది.అయితే వెంటనే బాలయ్యతో సినిమా చేసేందుకు గోపీచంద్ సిద్దమయ్యారు. ప్రస్తుతం గోపీ తను బాలయ్యతో చేయనున్న సినిమాకు కథను సిద్దం చేస్తున్నారు. అయితే వీరి కాంబో కోసం గోపీ అద్భుత ప్లాట్‌ను ఎంచుకున్నారంట. ప్రస్తుతం ఈ సినిమాలో బాలయ్య ఎలా కనిపిస్తారన్న వార్త హాట్ టాపిక్‌గా ఉంది. అయితే తాజాగా ఈ సినిమా కథ బ్యాక్ డ్రాప్ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా కథను గోపీ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్లో రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బాలకృష్ణ చాలా కాలం తరువాత ఫ్యాక్షన్ సినిమాలో చేయనున్నారు. ఈ సినిమాను కూడా నిజ సంఘటనల ఆధారంగానే రెడీ చేయనున్నారంట. ఇదిలా ఉంటే ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఈ సినిమాపై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి