ఖతార్లో నిషేధిత లిరికా పిల్స్ సీజ్

ఖతార్లో నిషేధిత లిరికా పిల్స్ సీజ్

ఖతార్ విమానాశ్రయంలో భారీగా నిషేధిత లిరికా పిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఓ ప్యాసింజర్ లగేజీపై అనుమానం రావటంతో ఎయిర్ కార్గో, ప్రైవేట్ ఎయిర్ పోర్ట్స్ కస్టమ్స్ అధికారులు క్షుణ్ణంగా సోదా చేశారు. చీరలో దాచిన 6,868 లిరికా మాత్రలను గుర్తించారు. చీర మడతల మధ్యలో మాత్రల ప్యాకెట్ ను పెట్టిన అక్రమ రవాణాదారులు ఎక్స్ రే స్కానర్లకు దొరక్కుండా పకడ్బందీగా ప్లాస్టిక్ కవర్లతో చుట్టినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన మాత్రలను సీజ్ చేసినట్లు వివరించారు. నిషేధిత వస్తువులు, మాదక ద్రవ్యాలు, మాత్రలను దేశంలోకి తీసుకొచ్చే ప్రయత్నం ఎవరు చేయవద్దని, కస్టమ్స్ కళ్లు గప్పి తప్పించుకోగలమని భ్రమ పడొద్దని అధికారులు హెచ్చరించారు. 

Back to Top