దుబాయ్ బస్సు ప్రమాదం ఘటనలో ఒమనీ డ్రైవర్ కి శిక్ష తగ్గింపు

- February 25, 2021 , by Maagulf
దుబాయ్ బస్సు ప్రమాదం ఘటనలో ఒమనీ డ్రైవర్ కి శిక్ష తగ్గింపు

దుబాయ్: 2019లో 17 మందిని బలి తీసుకున్న బస్సు ప్రమాదం ఘటనకు సంబంధించిన కేసులో డ్రైవర్ కు శిక్షను కుదించింది దుబాయ్ కోర్టు. గతంలో కేసు విచారణను చేపట్టిన కోర్టు ప్రమాదానికి ఒమనీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించి అతనికి ఏడేళ్ల జైలు శిక్ష, శిక్ష తర్వాత దేశ బహిష్కరణ విధిస్తూ తీర్పు ఇచ్చింది. అయితే గత తీర్పు, జరిగిన ప్రమాదంపై విచారణ చేపట్టిన దుబాయ్ కాసేషన్ కోర్టు ఒమనీ డ్రైవర్ శిక్షను ఏడేళ్ల నుంచి ఏడాదికి కుదించింది. అలాగే శిక్ష తర్వాత దేశ బహిష్కరణ తీర్పును కూడా రద్దు చేసింది. అయితే..అదే సమయంలో ఒమనీ డ్రైవర్ 3.4 మిలియన్ల దిర్హామ్ లను నష్టపరిహారంగా చెల్లించాలని దుబాయ్ కాసేషన్ కోర్టు తీర్పునిచ్చింది. అలాగే 50,000 దిర్హామ్ ల జరిమానా కూడా విధించింది. ఇదిలాఉంటే..2019 జూన్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో 55 ఏళ్ల ఒమనీ బస్సు డ్రైవర్ 94 కిలోమీటర్ల వేగంతో బస్సును డ్రైవ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బస్సు వెళ్తున్న మార్గంలో పరిమితికి మించి దాదాపు రెట్టింపు వేగంతో వెళ్లటం వల్లే అదుపు తప్పి సైన్ బోర్డును ఢీకొట్టి..పక్కనే ఉన్న మెటల్ బారియర్ ను బలంగా ఢీ కొట్టిందని విచారణలో తేల్చారు. అతి వేగం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని, 15 మంది కార్మికులు అక్కడిక్కడే మృతి చెందగా..ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కొల్పోయారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com