ఇక గర్భిణిలకు, పాలిచ్చే తల్లులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్
- February 26, 2021
బహ్రెయిన్: ఇక నుంచి పాలిచ్చే తల్లులకు, గర్భిణిలకు కూడా కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వాలని నిర్ణయించింది బహ్రెయిన్ ప్రభుత్వం. ఇన్నాళ్లు వృద్ధులు, దీర్ఘకాలిక రోగులు, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు వ్యాక్సిన్ వేసుకునేందుకు సంసిద్ధంగా ఉన్న ప్రజలకు మాత్రమే వ్యాక్సిన్ అందించారు. గర్భిణిలు, పిల్లలకు పాలిచ్చే తల్లులు, 16 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. అయితే..ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా రోగ నియంత్రణ కేంద్రం నుంచి వచ్చిన సూచనలు, సలహాలను స్టడీ చేసిన తర్వాత గర్భిణిలు, పాలిచ్చే తల్లులకు కూడా వ్యాక్సిన్ అందించటం ప్రమాదమేమి కాదనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ తో వారికి కూడా తగిన రక్షణ లభిస్తుందని తెలిపింది. అంతేకాదు..ఇన్నాళ్లు వ్యాక్సిన్ తీసుకునే వారికి ప్రభుత్వం ఏ వ్యాక్సిన్ అందిస్తే ఆ వ్యాక్సిన్నే తీసుకోవాల్సి వచ్చేది. లబ్ధిదారులకు వ్యాక్సిన్ ఎంపిక చేసుకునే అవకాశం ఉండేది కాదు. అయితే..గర్భిణులు, పాలిచ్చే తల్లులు మాత్రం సినోఫామ్, ఫైజర్ టీకాలలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చని కూడా బహ్రెయిన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఇబ్రిలో ట్రక్కులో ఆకస్మికంగా మంటలు..!!
- ఐఫోన్ కొంటున్నారా? నకిలీ ఇన్స్టాగ్రామ్ స్టోర్లపై వార్నింగ్..!!
- ఖతార్ చాంబర్, భారత వ్యాపార ప్రతినిధి బృందం చర్చలు..!!
- సౌదీలో పెరిగిన నిర్మాణ వ్యయ సూచికలు..!!
- అడ్వాన్స్డ్ AI టెక్నాలజీలతో స్మార్ట్ సెక్యూరిటీ పెట్రోల్స్..!!
- బంగ్లాదేశీయులపై యూఏఈ వీసా నిషేధం? నిజమెంత?
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!