అంతర్జాతీయ ప్రయాణికులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్

అంతర్జాతీయ ప్రయాణికులకు ఉచితంగా పీసీఆర్ టెస్ట్

కేరళ: కేరళాలోని విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పీసీఆర్ టెస్టులను ఉచితంగా నిర్వహిస్తున్నట్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 22 నుంచి రాష్ట్రంలోని విమానాశ్రయాల్లో చిన్న పిల్లలతో సహా అంతర్జాతీయ ప్రయాణికులు అందరికీ పీసీఆర్ టెస్టులు ఉచితంగా అందిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, కోల్ కతా, కొచ్చి, తిరువనంతపురంతో పాటు మొత్తం ఎనిమిది విమానాశ్రయాల్లో అంతర్జాతీయ ప్రయాణికులకు పీసీఆర్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. ఇందుకుగాను ఒక్కో ప్రయాణికుడికి అటు ఇటుగా రూ.2000 ఛార్జ్ చేస్తున్నారు. అయితే..విదేశాల నుంచి ఇంటికి వచ్చే ప్రవాస కేరళీయులకు పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి నిబంధనను మినహాయించాలని కేరళ ముస్లిం కల్చరల్ సెంటర్ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణికులకు పీసీఆర్ టెస్టులను ఉచితంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

Back to Top