‘హౌస్ అరెస్ట్’ టీజర్ విడుదల
- February 27, 2021హైదరాబాద్:ప్రముఖ హాస్య నటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కీలక పాత్రలతో రూపొందుతున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. '90ఎంఎల్' సినిమా దర్శకుడు శేఖర్ రెడ్డి ఎర్ర ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన హౌస్ అరెస్ట్ ప్రచార చిత్రాలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. చిచ్చర పిడుగుల్లాంటి కిడ్స్.. వాళ్ళ చేత చిక్కిన దుండగుల బ్యాచ్ మధ్య జరిగిన అల్లరిని చూపిస్తున్న ఈ టీజర్ అన్ని వర్గాలను అలరిస్తోంది. ఈ చిత్రానికి సంగీత సంచలనం అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు..
- శంషాబాద్ విమానాశ్రయం వద్ద బోనులో చిక్కిన చిరుత
- హైదరాబాద్ లోని OYO హోటల్ లో భారీ అగ్ని ప్రమాదం
- యూఏఈ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు..అలెర్ట్ జారీ
- యూఏఈ అధ్యక్షుడికి సంతాపాన్ని తెలిపిన సుల్తాన్
- కువైట్ వెదర్ రిపోర్ట్.. వీకెండ్ లి మిశ్రమ వాతావరణం
- నాన్-అయోనైజింగ్ రేడియేషన్ స్థాయిలను తెలిపే ప్లాట్‌ఫారమ్ ప్రారంభం
- దుబాయ్‌లో కలరా కేసులు నమోదుపై అధికారుల క్లారిటీ
- హజ్ 2024..నుసుక్ యాత్రికుల కార్డు ఆవిష్కరణ
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!