నిజాయితీ చాటుకున్న నలుగురు డ్రైవర్లు..ప్రశంసించిన ఆర్టీఏ
- February 27, 2021
దుబాయ్:దుబాయ్ లో నలుగురు డ్రైవర్లు తమ నిజాయితీ చాటుకున్నారు.అత్యాశకు పోకుండా ప్రయాణికుడి విలువైన వస్తువులను అతనికి అందించి ఓ డ్రైవర్ నిజాయితీ చాటుకుంటే..మరో ముగ్గురు ఓ మహిళకు సాయం చేసి మంచి మనసును చాటుకున్నారు.దుబాయ్ టాక్సీ కార్పొరేషన్‌కు చెందిన డ్రైవర్ ఫిరోస్ చారుపాడికల్ టాక్సీలో ఓ ప్రయాణికుడు విలువైన వస్తువులతో ఉన్న బ్యాగును మర్చిపోయాడు. అయితే..ఫిరోస్ ఆ బ్యాగును భద్రంగా ఆ పర్యాటకుడికి అప్పగించి నిజాయితీ చాటుకున్నాడు. మరోచోట ముగ్గురు బస్సు డ్రైవర్లు హసన్ ఖాన్, అజీజ్ రెహ్మాన్, హుస్సేన్ నజీర్...వాహనం చెడిపోయి అవస్థలు పడుతున్న ఓ మహిళకు సాయం చేశారు. తమ టైర్ ను ఆ మహిళ వాహనానికి అమర్చి అమను సురక్షితంగా అక్కడి నుంచి ఇంటికి పంపించారు.ఈ నలుగురు డ్రైవర్ల నిజాయితీ, నైతిక విలువల గురించి తెలుసుకున్న ఆర్టీఏ చైర్మన్ మాత్తార్ మొహమ్మద్ అల్ తేయర్..వారిని ప్రశంసించారు. డ్రైవర్ల అంకితభావానికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







