సౌదీ:ఆర్ధిక నేరం కేసులో ముగ్గురు అరెస్ట్..740మిలియన్ల రియాల్స్ రికవరీ
- February 28, 2021
రియాద్:కంపెనీల ద్వారా అక్రమంగా నగదు బదిలీ చేస్తున్న నేరగాళ్ల గుట్టును సౌదీ ఆర్ధిక నేర విచారణ విభాగం బట్టబయలు చేసింది. విదేశాల నుంచి నకిలీ కంపెనీకి బదిలీ అయిన నిధులను తరలిస్తుండగా పట్టుబడ్డారు. అక్రమ నగదు బదిలీ కుంభకోణంలో ముగ్గురు పాత్ర ఉన్నట్లు నిర్ధారించింది. నిందితుల నుంచి 740 మిలియన్ల సొమ్మును సీజ్ చేసింది. ఒక సౌదీ పౌరుడు..ఇద్దరు ప్రవాసీయులు ఉన్నారని, ప్రవాసీయులు ఇద్దరు ఆఫ్రీకాకు చెందినవారీగా విచారణలో తేల్చి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు నివేదించింది. సౌదీకి చెందిన వ్యక్తి రెండు సంస్థలను ఏర్పాటు చేయగా..ఇద్దరు ఆఫ్రికన్లు కమర్షియల్ కవర్ అప్ ఆపరేషన్స్ ద్వారా సమకూరిన అక్రమ నిధులను కంపెనీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించేవారు. ఇందుకు ప్రతిఫలంగా కంపెనీదారుడికి కొంత మొత్తాన్ని అందించేవారు. అయితే..కంపెనీ
అనుమానస్పద లావాదేవీలపై నిఘా పెట్టిన ఆర్ధిక నేర విచారణ విభాగం అధికారులు కమర్షియల్ కవర్ అప్ ఆపరేషన్ గుట్టును వెలుగులోకి తీసుకొచ్చారు. ముగ్గుర్ని అరెస్ట్ చేసి విదేశాలకు బదిలీ అయిన నగదును వివరాలను ట్రాక్ చేస్తున్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన పబ్లిక్ ప్రాసిక్యూషన్ దోషులకు పదహారేళ్ల జైలు శిక్ష విధించింది. 1,68,000 రియాల్స్ జరిమానా విధించింది.
తాజా వార్తలు
- లులు గ్రూప్ తిరిగి విజాగ్లో మాల్ ప్రాజెక్ట్ ప్రారంభం, ఏపీ ప్రభుత్వంతో MoU
- జగన్‌కు చెందిన ఆస్తులపై స్టే కొనసాగాలి
- టీటీడీకి రూ.కోటి విరాళం
- ప్రభుత్వాస్పత్రిలో దారుణం..ఇంజక్షన్ వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత
- హైదరాబాద్–విజయవాడ హైవే పై 60 అండర్‌పాస్‌లు
- నితీశ్ రాజకీయాల్లో అరుదైన రికార్డు
- ఎల్బీ స్టేడియంలో అరైవ్ అలైవ్ లాంచ్
- CII సదస్సు తొలిరోజు రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు
- ఖతార్ లో ఉపాధ్యాయులకు సామర్థ్య పరీక్షలు..!!
- కువైట్ లో పొగమంచు, రెయిన్ అలెర్ట్ జారీ..!!







