నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV-C51 రాకెట్
- February 28, 2021
శ్రీహరి కోట:భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష సంస్థ ఇస్రో చేపట్టిన PSLV-C51 రాకెట్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలను నింగిలోకి తీసుకెళుతోంది. 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా విదేశీ ప్రైవేటు సంస్థల ఉపగ్రహాలను భారత్ అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. ప్రయోగం నాలుగు దశలు విజయవంతమయ్యాయి. అమెజానియా అమెజానియా-1తో పాటు 18 ప్రైవేటు ఉపగ్రహాలు అంతరిక్ష్య కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించాయి. ప్రయోగం విజయవంతమవడం పట్ల ఇస్రో ఛైర్మన్ శివన్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో ఇస్రో చేసిన తొలి అంతరిక్ష ప్రయోగం ఇదే కావడం విశేషం.
ఇదిలా ఉంటే.. PSLV-C51 ద్వారా..భగవద్గీతతో పాటు..ప్రధాని మోదీ ఫొటోను నింగోలోకి పంపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది ఇస్రో. ఈ PSLV-C51 రాకెట్ ద్వారా.. ఓ ఈ అరుదైన ఘట్టానికి తెరలేపింది చెన్నైకు చెందిన స్పేస్ కిడ్జ్స్ అనే ఇండియా సంస్థ. మొట్టమొదటిసారిగా తాము చేస్తున్న ఈ ప్రయోగంలో .. ప్రధాని మోదీ ఫొటో కింద..ఆత్మనిర్భర్ మిషన్ అనే పదాలతో పాటు భగవద్గీతను పంపించారు. అంతేకాదు. మరో 25వేల మంది పేర్లను కూడా పంపించారు. ఆ 25వేల మందిలో వెయ్యి మంది విదేశీయులు కాగా..చెన్నైలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థుల పేర్లున్నాయి.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







