భారత్ లో కరోనా కేసుల వివరాలు
- February 28, 2021
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి.గత కొన్ని రోజులుగా దేశంలో రోజుకు 16వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.కేసులు పెరుగుతున్న తరుణంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి.గడిచిన 24 గంటల్లో భారత్ లో కొత్తగా 16,752 కేసులు నమోదయ్యాయి.దీంతో భారత్ లో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,96,731కి చేరింది.ఇందులో 1,07,75,169 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,64,511 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.ఇక గడిచిన 24 గంటల్లో భారత్ లో కరోనాతో 113 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,051కి చేరింది.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







