అమితాబ్ కు మళ్ళీ ఆపరేషన్
- February 28, 2021
బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్(78) మరోసారి సర్జరీ చేయించుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన బ్లాగులో వివరిస్తూ.. కొద్ది రోజులు బ్లాగ్‌కు దూరంగా ఉంటున్నానని ప్రకటించారు. బిగ్‌బీకి సర్జరీ అనేసరికి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అమితాబ్‌కు ఏమైంది.. అసలు సర్జరీ ఎందుకు? తన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అలాగే బిగ్‌బీ చేయించుకోబోయే శస్త్ర చికిత్స విజయవంతం కావాలంటూ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. త్వరగా కోలుకొని మళ్లీ సినిమాలు చేయాలని ఆశిస్తున్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు.
కాగా, గతంలో కూడా బిగ్‌బీకి అనేకసార్లు సర్జరీ జరిగింది. 1982లో ‘కూలి’ సినిమా షూటింగ్ సమయంలో సర్జరీ చేయించుకొని నెలల తరబడి ఆస్పత్రిలో ఉన్నారు. 2005లో కడుపు నొప్పి తీవ్రతరం కావడంతో శస్త్ర చికిత్స జరిగింది. అబితాబ్ తాజాగా నటించిన చిత్రాలలో ‘ఝుండ్’ జూన్ 18న ‘చెహరే’ ఏప్రిల్ 30న విడుదల కానున్నాయి.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష