బహ్రెయిన్:ఫుడ్ ట్రక్స్ లో తనిఖీలు..సెఫ్టీ ప్రమాణాల పరిశీలన
- February 28, 2021
మనామా:ఆహార పదార్ధాలను సరఫరా చేసే ఫుడ్ ట్రక్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫిబ్రవరి 26న చేపట్టిన డ్రైవ్ లో భాగంగా... జఫైర్, బసైతీన్ లోని అల్ సాయలో ఎనిమిది ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు ఈ సోదాలో పాల్గొన్నారు. జుఫైర్ 19, అల్ సయలో 41 ఫుడ్ ట్రక్కుల్లో భద్రత ప్రమాణాలను పరిశీలించారు. మొత్తం 130 ఫుడ్ ట్రక్కులు ఉండగా ప్రస్తుతం 61 ట్రక్కుల్లో సోదాలు చేపట్టామని, మిగిలిన వాటిని మలి విడత డ్రైవ్ లో తనిఖీ చేస్తామన్నారు అధికారులు. తమ తనిఖీల్లో 11 ఫుడ్ ట్రక్కులు నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించామని, ఎనిమిది మంది ట్రక్కు ఓనర్లు బహ్రెయినీయులకు బదులుగా విదేశీయులను ఉద్యోగంలోకి తీసుకున్నారని, మరో మూడు ట్రక్కు డ్రైవర్లకు సరైన లైసెన్స్ లేవని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష