విదేశీ ప్రయాణికులకు అనుమతిపై కువైట్ కొత్త మార్గనిర్దేశకాలు
- February 28, 2021
కువైట్ సిటీ:దేశంలోకి విదేశీ ప్రయాణికులపై అనుమతిపై కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది కువైట్ డీజీసీఏ. నాన్-కువైట్ ప్రయాణికులు ఎవరికీ దేశంలోని విమానాశ్రయాల్లోకి అనుమతి ఉండబోదని స్పష్టం చేసింది. గల్ఫ్ దేశాల్లో క్వారంటైన్ లో ఉండి..ఆయా దేశాల మీదుగా ప్రయాణం చేసినా కువైట్లోకి అనుమతి ఉండదని వెల్లడించింది. దీనికి సంబంధించి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తమకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ వెల్లడించింది. ట్రాన్సిట్ ప్యాసింజర్లను కువైట్ ఎయిర్ పోర్టులో విమానం దిగేందుకు కూడా అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







