ఫేక్ కరెన్సీని విసిరిన వ్యక్తి అరెస్ట్, భారీ జరీమానా
- March 01, 2021
దుబాయ్:దుబాయ్‌లో ఓ వ్యాపారవేత్తకు న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. అతనికి 200,000 దిర్హాముల జరీమానా కూడా విధించడం జరిగింది. యూరోప్‌కి చెందిన వ్యక్తిగా నిందితుడ్ని గుర్తించారు. 500 యూరో ఫేక్ బిల్స్‌ని నిందితుడు తన కారు నుంచి బయటకు విసిరివేసినట్లు అభియోగాలు మోపబడ్డాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఫాలోవర్స్‌ని పెంచుకోవడమే లక్ష్యంగా నిందితుడు ఈ చర్యకు పాల్పడ్డాడు. అల్ కోజ్ ఇండస్ర్టియల్ ఏరియాలో నిందితుడు ఫేక్ కరెన్సీని కారు నుంచి బయటకు విసిరివేసినట్లు అతను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. నిందితుడు విచారణ సందర్భంగా తన నేరాన్ని అంగీకరించాడు. 740,000 ఫేక్ యూఎస్ డాలర్లను నిందితుడు పొందగలిగాడని, యూరో బిల్స్‌ను ఆసియాకి చెందిన వ్యక్తి నుంచి 1,000 దిర్హాములకు నిందితుడు కొనుగోలు చేశాడని పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









