కోవిడ్ టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- March 01, 2021
న్యూ ఢిల్లీ:ప్రధాన నరేంద్ర మోదీ కోవిడ్ టీకా వేయించుకున్నారు. భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను మోదీ తీసుకున్నారు. మోదీకి సిరంజీ ద్వారా ఎయిమ్స్ సిస్టర్ పి.నివేదా టీకా ఇచ్చారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్లో భాగంగా 60 ఏళ్లు పైబడిన వారికి, 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాల వ్యాధిగ్రస్థులకు ఇవాల్టి నుంచి టీకా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ప్రధాని మోదీ తొలి డోసు టీకాను తీసుకున్నారు. తాను తొలి డోసు టీకా తీసుకున్నట్లు మోదీ ట్విటర్ ద్వారా ప్రకటించారు.
కొవిడ్‌కి వ్యతిరేకంగా మన దేశ వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు. అర్హులందరూ కోవిడ్ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. మనమందరం కలిసి భారత్‌ను కొవిడ్ రహిత దేశంగా తీర్చిదిద్దుదామని ఆయన పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









