అమెరికాలో కళాతపస్వికి స్వరాభిషేకం

- March 01, 2021 , by Maagulf
అమెరికాలో కళాతపస్వికి  స్వరాభిషేకం

హ్యూస్టన్ /టెక్సాస్:  గాయని శారద ఆకునూరి- అమెరికా మరియు వంశీ ఇంటర్నేషనల్ -ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో  దాదాసాహెబ్ ఫాల్కే  మరియు పద్మశ్రీ పురస్కార గ్రహీత  కళాతపస్వి డా కె విశ్వనాధ్ 91  వ జన్మదినమహోత్సవం అంతర్జాలంలో అత్యంత అద్భుతంగా జరిగింది. శారద ఆకునూరి నిర్వహణ/  వ్యాఖ్యాతగా ఈ కార్యక్రమంలో విశ్వనాధ్ గారు దర్శకత్వం వహించిన ఆపద్బాంధవుడు  చిత్ర కథానాయకి మీనాక్షి శేషాద్రి మాట్లాడుతూ " ఆపద్బాంధవుడు చిత్రంలో కథానాయికగా తనకు నంది అవార్డు వచ్చిందని, అప్పటి షూటింగ్ జ్ఞాపకాలు  ఎప్పటికీ మర్చిపోనని " అన్నారు.

విశ్వనాధ్ "ఉండమ్మా బొట్టు పెడతా" చిత్ర కథానాయకి జమున రమణరావు మాట్లాడుతూ విశ్వనాధ్ ప్రతిభను దర్శకత్వ విలువలను చిత్రీకరణ విధానాన్ని తనకు విశ్వనాధ్ కి ఉన్న అనుబంధాన్ని కొనియాడారు. 

సూత్రధారులు చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన ప్రముఖ సినీ నటులు ఎం.మురళీమోహన్ మాట్లాడుతూ కళా ఖండాలు నిర్మించే విశ్వనాథ్ చిత్రాలలో తానూ నటించాలనే కోరిక ఉండేదని ఆ కోరిక సూత్రదారులు ద్వారా తీరిందని తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరపురాని ఒక ఆదర్శవంతమైన దర్శకుడు విశ్వనాథ్ అని ప్రస్తుతించారు.
సిరి సిరి మువ్వ, శుభోదయం, ఓ సీతకధ, సీతామాలక్ష్మి వంటి  చిత్రాలలో కధానాయకుడిగా నటించిన చంద్రమోహన్ మాట్లాడుతూ తనకెన్నో చిత్రాలలో హీరో పాత్రలు ఇచ్చి తన పురోభివృద్ధికి తోడ్పడిన సోదర సమానులు విశ్వనాధ్ గారిని కొనియాడారు.
ఓ సీతకధ చిత్రంలో  కధానాయిక   రోజారమణి  మాట్లాడుతూ  నాయిక పాత్రను ఇచ్చి తనను ప్రోత్సహించారని అన్నారు.

 

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారులు ఏడిద రాజా  "శంకరాభరణం సాగరసంగమం,సిరిసిరి మువ్వ, స్వాతి ముత్యం, ఆపదబంధవుడు, స్వయంకృషి లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించి మా పూర్ణోదయా కు  ప్రపంచ ఖ్యాతిని తెచ్చిన దర్శకులు విశ్వనాథ్ " అని అన్నారు.

అమెరికాలోని వివిధ ప్రాంతాల నుండి గాయనీ గాయకులు విశ్వమోహన్, చంద్రహాస్, రాధికా నోరి, ప్రసాద్ ఘంటా, శ్రీకర్ దర్భ, GV ప్రభాకర్, శృతి, ఉష, శ్రీనివాస్ దుర్గం, సంతోష్ నందగిరి, ప్రసాద్  కొమ్మరాజు, జ్యోతి,కృష్ణ, శరత్ పసుమర్తి,  లావణ్య, శ్రీనివాస్ వడ్లమాని విశ్వనాథ్  దర్శకత్వం వహించిన చిత్రాలలోని పాటలని పాడారు. 


ఈ సందర్భంగా కళాతపస్వి విశ్వనాధ్ గాయనీ గాయకులకు అభినందలు అందజేశారు 
శిరోమణి వంశీ రామరాజు K.విశ్వనాధ్ కు ఎన్నో సార్లు వంశీ-బెర్కెలీ అవార్డ్స్ లో ఉత్తమ దర్శకుడుగా సత్కరించామని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com