పాక్షిక లాక్ డౌన్ దిశగా ఒమన్...
- March 02, 2021
మస్కట్:ఒవైపు కోవిడ్ కేసులు రోజు రోజుకి పెరుగుతుండటం..మరోవైపు సెకండ్ వేవ్ ముప్పు వెంటాడుతున్న నేపథ్యంలో ఒమన్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ దిశగా చర్యలు తీసుకుంటోంది. కఠిన నిర్ణయాలతో మళ్లీ పాక్షిక లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి రాత్రి వేళలో వాణిజ్య కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 4 నుంచి 20 వరకు రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు అత్యవసర సేవా కేంద్రాలు మినహా వాణిజ్య కేంద్రాలను మూసివేయాలని ఒమన్ సుప్రీం కమిటీ ఆదేశించింది. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. అయితే..పెట్రోల్ బంకులు, ఆరోగ్య కేంద్రాలతో పాటు అన్ని మెడికల్ షాపులకు మాత్రం మినహాయింపు ఇచ్చామని వివరించింది. పబ్లిక్ స్కూళ్లలో కూడా మార్చి 7 నుంచి 11 వరకు ఆన్ లైన్ బోధనా విధానాన్నే అమలు చేయాలని పేర్కొంది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి, ఒమన్)
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







