దేశంలో ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు త్వరలో
- February 27, 2016
దేశంలో ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. నాగ్ పూర్-పుణె మధ్య 10 ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మార్చి నెలలో ఈ రైలు సర్వీసులను ప్రారంభించనున్నట్లు రైల్వేశాఖ అధికారులు ప్రకటించారు. ఈ రైళ్లకు 16 కోచ్ లు ఉండగా, అందులో ఒక 1ఏసీ, నాలుగు 2ఏసీ, తొమ్మిది 3ఏసీ, రెండు పవర్ వ్యాన్ ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.రైలు సర్వీసులు ఇవే: 02124 రైలు ప్రతి మంగళవారం(మార్చి 1, 8, 15, 22, 29) నాగ్ పూర్ నుంచి రాత్రి 7:50కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 11:45కు పుణె చేరుకుంటుంది. అదేవిధంగా 02123 రైలు ప్రతి బుధవారం (మార్చి 2, 9, 16, 23, 30) పుణె నుంచి మధ్యాహ్నాం 3:15కి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 5:15 గంటలకు నాగ్ పూర్ కు చేరుకుంటుందని సెంట్రల్ రైల్వే వారు వివరించారు.వార్ధా, ధమాంగో, బద్నేరా, భుశవాల్, మన్మాడ్, కొపార్గావ్, డౌండ్ లాంటి ముఖ్య స్టేషన్లలో ఆగుతుందని రైల్వేశాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్







