మార్చి 26న విడుదల కానున్న 'సైనా' బయోపిక్
- March 02, 2021హైదరాబాద్:ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైన నెహ్వాల్ బయోపిక్ ఈ నెల 26న విడుదల కానుంది. ఓ సాధారణ యువతి ఒలంపిక్ మెడల్ ఎలా సాధించిందనే అంశంతో ఈ బయోపిక్ తెరకెక్కింది. పరిణితీ చోప్రా సైనా పాత్రలో నటించింది. టీ సీరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు అమోల్ గుప్తే. 'సైనా' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ విడుదలైంది. ప్రీ లుక్ పోస్టర్ తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటించారు దర్శకనిర్మాతలు. సైనా నిజజీవితంలో జరిగిన సంఘటనలో తెరకెక్కిన ఈ సినిమా కోసం పరిణితీ చోప్రా కఠోర సాధన చేసింది. బయోపిక్ లకు ఆదరణ లభిస్తున్న ప్రస్తుత నేపథ్యంలో సైనా నెహ్వాల్ బయోపిక్ 'సైనా' కూడా ప్రేక్షకాదరణ పొందుతుందేమో చూద్దాం.
తాజా వార్తలు
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- విద్యార్థులపై లైంగిక వేధింపులు.. టీచర్‌కు 15 ఏళ్ల జైలుశిక్ష
- మనీలాండరింగ్..పౌరులు, ప్రవాసుడు అరెస్ట్
- నాలెడ్జ్ ఒమన్ అకాడమీ ప్రారంభం
- వేసవి కొత్త సీజన్ ప్రారంభం.. 40°Cకు ఉష్ణోగ్రతలు
- భారీ వర్షాలు.. నివాసితుల ముందస్తు జాగ్రత్తలు..!
- పారిశ్రామిక చట్టాల ఉల్లంఘన..11సంస్థలు మూసివేత