ఆ ప్యాసింజర్లకు అనుమతి లేదు
- March 02, 2021
యూఏఈ:కోవిడ్ ఎఫెక్ట్ కారణంగా సౌతాఫ్రికా, నైజీరియా దేశాల నుంచి రాకపోకలను రద్దు చేస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. లాక్ డౌన్ తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగా ప్రపంచ దేశాల నుంచి ప్రయాణికుల రాకకు దుబాయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. పర్యాటక రంగానికి దోహదపడేలా పలు నిర్ణయాలను కూడా తీసుకుంది. అయితే..కరోనా సెకండ్ వేవ్ ప్రమాద ఘటికలు మోగిస్తున్న ప్రస్తుత తరుణంలో దుబాయ్ పాలనా యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సౌతాఫ్రికా, నైజీరియా నుంచి రాకపోకలను నిషేధించింది. చివరికి యూఏఈ రెసిడెన్సీ వీసా ఉన్నా కూడా ఈ రెండు దేశాల నుంచి నేరుగా వచ్చే వారు కానీ, ట్రాన్సిట్ ప్యాసెంజర్లకుగానీ దుబాయ్ కి వచ్చేందుకు అనుమతించబోమని స్పష్టం చేసింది. అయితే..కొన్ని వర్గాలకు మాత్రం ట్రావెల్ బ్యాన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. యూఏఈ పౌరులు, దౌత్యవేతలకు దేశంలోకి వచ్చేందుకు అనుమతి ఉన్నట్లు వెల్లడించింది. నైజీరియా నుంచి వచ్చే దౌత్య వేతలు మాత్రం కోవిడ్ నెగటీవ్ రిపోర్ట్ ను తప్పనిసరిగా సమర్పించాలని సూచించింది. బయల్దేరే సమయానికి 14 రోజుల కంటే తక్కువ గడువులో సౌతాఫ్రికా నుంచి నేరుగా వచ్చే వారు గానీ, సౌతాఫ్రికా మీదుగా ప్రయాణించే వారికి గానీ దుబాయ్ కి అనుమతి ఉండదని క్లారిటీ ఇచ్చింది. ఈ ట్రావెల్ బ్యాన్ ఫిబ్రవరి 24 నుంచి అమలులోకి వస్తుందని, మార్చి 10 వరకు అమలులో ఉంటుందని యూఏఈకి చెందిన విమానయాన సంస్థలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ICC T20 World Cup 2026: ఇంగ్లండ్ పై వెస్టిండీస్ విజయం
- నాలుగో అత్యంత విలువైన సంస్థగా SBI
- కెనడా స్కూల్లో కాల్పులు..10 మంది మృతి
- BHELలో 5 శాతం వాటాల విక్రయం..
- పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్: మునిసిపల్ ఎన్నికల్లో ఆ పార్టీ దే హవా!
- తెలంగాణ: మున్సిపల్ పోలింగ్ ముగిసింది
- సామాజిక రక్షణ పథకాల కవరేజ్ గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపి బాలశౌరి
- అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గింది..రాహుల్‌గాంధీ
- రేపు భారత్ బంద్..
- ఆంధ్రప్రదేశ్: మార్చి 6 వరకు అసెంబ్లీ సమావేశాలు









