‘డి-కంపెనీ’ ట్రైలర్ విడుదల అప్డేట్
- March 02, 2021
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ అండర్ వరల్డ్ సినిమాలకు పెట్టింది పేరు.‘సత్య’, ‘కంపెనీ’ వంటి సినిమాలలో అండర్ వరల్డ్ మాఫియా గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు వర్మ.ఇప్పుడు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం జీవితంలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ‘డి-కంపెనీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు వర్మ. ‘డి-కంపెనీ’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెబుతోన్న వర్మ.. దీనికి హైప్ తీసుకురావడానికి బాగానే ప్రచారం చేస్తున్నారు. కాగా ఆమధ్య వచ్చిన టీజర్ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. తాజాగా వర్మ ‘డి-కంపెనీ’ ట్రైలర్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తున్నట్లు వర్మ ప్రకటించారు.మార్చి 26న సినిమా విడుదల కానుంది. స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై స్పార్క్ సాగర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ మూవీ ఐదు భాషల్లో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష