వాట్సాప్ లో తలాక్ మెసేజ్ పంపించినా విడాకులు ఇచ్చినట్టే!
- March 03, 2021
రియాద్:వాట్సాప్ ద్వారాగానీ, టెక్ట్స్ మెసేజ్ ద్వారాగానీ భార్యకు తలాక్ మెసేజ్ పంపిస్తే విడాకులు ఇచ్చినట్లే పరిగణించబడుతుందని సౌదీలోని ఇస్లాం మత పెద్దలు స్పష్టం చేశారు. మొబైల్ సందేశం ఇవ్వటం అంటే రాతపూర్వకంగా చెప్పటమేనని, అందుకే వాట్సాప్, టెక్ట్స్ మెసేజ్ ద్వారా విడాకులు ఇచ్చినా అవి చెల్లుబాటు అవుతాయన్నారు. ఇది షరియా ఇస్లామిక్ మతాచారాలు, నిబంధనలు లోబడి ఉన్నట్లు సౌదీ అరేబియాలోని ఇస్లామిక్ బాడీ సభ్యుడు షేక్ అబ్దుల్లా అల్ మత్లాఖ్ స్పష్టం చేశారు. ఓ భర్త తన భార్యకు వాట్సాప్ ద్వారా విడాకుల ప్రమాణం చేస్తే..దాన్ని విడాకులుగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. ఇదిలాఉంటే ఇటీవలి కాలంలో సౌదీ అరేబియాలో విడాకుల శాతం పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు పది మంది దంపతుల్లో ముగ్గురు విడాకులు తీసుకుంటున్నట్లు అధికారిక గణాంకాల ద్వారా స్పష్టం అవుతోంది.
తాజా వార్తలు
- ఫిలడెల్ఫియాలో ఘనంగా NATS బాలల సంబరాలు
- నమీబియా పై భారత్ భారీ స్కోరు
- ప్రపంచంలోనే మొట్టమొదటి 24 గంటల స్టేడియం స్పోర్ట్స్ హాకథాన్కు ఆతిథ్యం వహించనున్న తెలంగాణ
- NTRకు భారతరత్న ఇవ్వాలి: సీఎం రేవంత్
- దేశంలోనే తొలి మ్యూజిక్ రోడ్డు ప్రారంభం..
- నిమాయిష్ బహుమతుల ప్రదానోత్సవంలో మంత్రి జూపల్లి కృష్ణారావు
- కొలకలూరి సాహిత్య పురస్కారాలు–2026 విజేతల ప్రకటన
- ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడిగా సిద్దిపేట యువకుడు
- పవర్ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల









