లేబర్ చట్టాలు, నిబంధనలపై అవగాహన కోసం జిసివో వాట్సాప్ సర్వీస్

- March 03, 2021 , by Maagulf
లేబర్ చట్టాలు, నిబంధనలపై అవగాహన కోసం జిసివో వాట్సాప్ సర్వీస్

దోహా:ఖతార్ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (జిసివో), మినిస్ట్రీ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ డెవలప్‌మెంట్ లేబర్ అండ్ సోషల్ ఎఫైర్స్ సహకారంతో వాట్సాప్ మెసెజింగ్ సర్వీస్ ప్రారంభించింది. ఈ సర్వీసు ద్వారా ఎంప్లాయర్స్ అలాగే ఎంప్లాయీస్‌కి సంబంధించి ఖతార్ లేబర్ చట్టాలు మరియు నిబంధనలపై అవగాహన పెంచడానికి వీలవుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సదరు నెంబరుకు ‘హాయ్’ అని మెసేజ్ చేస్తే, ఆ తర్వాత ఆరు భాషల్లో (అరబిక్, ఇంగ్లీషు, ఉర్దు, హిందీ, నేపాలీ, మలయాళం) ఆప్షన్స్ వస్తాయి. ఆయా భాషల్లో తమ ప్రశ్నలను సంధించి, సమాధానాలు తెలుసుకోవచ్చు. ఫిర్యాదులు చేయడం, హక్కుల గురించి తెలుసుకోవడం, అప్లికేషన్ స్టేటస్ వంటివన్నీ ఇక్కడ లభ్యమవుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com