హ్యాండ్ ఓవర్‌కి సిద్ధమైన 75 శాతం సెలూన్ల నిర్వాహకులు

- March 03, 2021 , by Maagulf
హ్యాండ్ ఓవర్‌కి సిద్ధమైన 75 శాతం సెలూన్ల నిర్వాహకులు

కువైట్ సిటీ:ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించకపోవడంతో సెలూన్ల నిర్వహణ కష్ట సాధ్యమైందనీ, ఈ పరిస్థిత్లులో సెలూన్లను నిర్వహించలేమంటూ 75 శాతం నిర్వాహకులు, తమ సెలూన్లను ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయడానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు కువైట్ సెలూన్ ఫెడరేషన్ ఓ సమావేశం ఏర్పాటు చేసుకోగా, సమావేశంలోనే సెలూన్ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భవిష్యత్తులో మరిన్ని నష్టాల్ని భరించడం తమ వల్ల కాదని వారంటున్నారు. 

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com