తెలంగాణ గవర్నర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

- March 04, 2021 , by Maagulf
తెలంగాణ గవర్నర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు

హైదరాబాద్:తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. ఇక, తాజాగా, పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు చేపట్టి.. అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు.. ఇప్పుడు గవర్నర్ తమిళిసైని ప్రతిష్టాత్మక  టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు వరించింది..యూఎస్ కాంగ్రస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా.తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు.గవర్నర్ తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది.సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా.తమిళిసై సౌందరరాజన్‌ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com