తెలంగాణ గవర్నర్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
- March 04, 2021
హైదరాబాద్:తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్.. ఇక, తాజాగా, పుదుచేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలు చేపట్టి.. అక్కడ చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను సమర్థవంతంగా హ్యాండిల్ చేశారు.. ఇప్పుడు గవర్నర్ తమిళిసైని ప్రతిష్టాత్మక టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ – 2021 అవార్డు వరించింది..యూఎస్ కాంగ్రస్ మ్యాన్ డానికే డేవిస్ మల్టీ ఎథ్నిక్ అడ్వయిజరి టాస్క్ ఫోర్స్ వారిచే ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు డా.తమిళిసై సౌందరరాజన్ ఎంపికయ్యారు.గవర్నర్ తో పాటు అమెరికా దేశ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలు ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికయ్యారు.9వ వార్షిక కాంగ్రషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే గాలా వేడుకల సందర్భంగా ఈ నెల 7వ తేదీన అమెరికా నుండి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డుల ప్రదానం జరగనుంది.సమాజం హితం కోసం అత్యున్నత సేవలు అందించినందున డా.తమిళిసై సౌందరరాజన్‌ను ఈ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక పురస్కారం వరించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







