‘జాతిరత్నాలు’ ట్రైలర్ విడుదల చేసిన ప్రభాస్
- March 04, 2021
హైదరాబాద్:‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమా’తో తెలుగులో అరంగేట్రం చేసిన నవీన్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం ‘జాతి రత్నాలు’. ఈ సినిమా ఈ నెల11న విడుదల కానుంది. కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లాహ్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అనుదీప్ దర్శకత్వంలో నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్నీ కూడా సినిమాపై అంచనాలను పెంచేశాయి. తాజాగా ‘జాతి రత్నాలు’ ట్రైలర్‌ను పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. కాగా ఈ ట్రైలర్ విడుదల కోసం ముంబైలో ఉన్న ప్రభాస్ ను కలవడానికి వెళ్ళింది చిత్రబృందం. ఈ సందర్భంగా వారితో ప్రభాస్ సరదాగా కాసేపు గడిపారు. ప్రభాస్ మాట్లాడుతూ.. ‘ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ట్రైలర్ తోనే ఇంత నవ్వుకున్నానంటే సినిమా చూస్తే ఎలా ఉంటాడో ఊహించగలను’ అంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!