తెలంగాణలో కరోనా కేసుల వివరాలు
- March 05, 2021
హైదరాబాద్:తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతున్నది.కేరళ, మహారాష్ట్రలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.ఇక ఇదిలా ఉంటె, తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా బులెటిన్ ను విడుదల చేసింది.ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో తాజాగా 166 కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో రాష్ట్రంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2,99,572కి చేరింది. ఇందులో 2,95,970 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1963 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.అయితే, తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా ఇద్దరు కరోనాతో మృతి చెందారు.ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1639గా ఉన్నది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్‌ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!