మహిళలకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
- March 07, 2021
హైదరాబాద్:మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.రేపు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవన్ని పురస్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మహిళా లోకానికి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం ఆదేశాలతో సీఎస్ మహిళా ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తూ సర్క్యూలర్ జారీ చేశారు.మహిళా సంక్షేమంలో తెలంగాణ ముందంజలో ఉందని సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. మహిళా సాధికారత కేంద్రంగా పని చేస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం అని అన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. మహిళల భద్రత కోసం షీటీమ్స్, వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు, వితంతువులకు పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్, కేసీఆర్ కిట్, అంగన్‌వాడీ, ఆశావర్కర్లకు వేతనాల పెంపు సహా వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు వి-హబ్ వంటి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష