దుబాయ్ లో 1 మిలియన్ దినార్ల విమానటికెట్లు అమ్మిన మోసగాళ్ళు
- February 28, 2016
విమాన టికెట్లు 'డెడ్ చీప్' గా లభిస్తున్నాయని పలువురు ఎగబడి జోరుగా కొన్నారు, వాటితో చవకగా విమానంలో ప్రయణిద్ధామని ఆశపడ్డారు. ఆ టికెట్లు నకిలీవని పోలీసులు తేల్చడంతో వీటిని కొన్నవారు తాము మోసపోయామని తెల్సుకొని లబోదిబోమంటున్నారు, ఈ నకిలీల భాగోతం దుబాయ్ పోలీసులు ఛేదించారు. 2015 నుంచి మోసపూరితంగా విమాన టికెట్లను బుకింగ్ చేసిన 381 మందిని ఈ కేసు లో పట్టుకొన్నట్లు లెఫ్టినెంట్ కల్నల్, డైరెక్టర్, సైబర్ క్రైమ్స్ దుబాయ్ పోలీస్ సయీద్ అల్ హజ్రి తెలిపారు. దుబాయ్ లో ఆరుగురు మోసగాళ్ళు సామాజిక మాధ్యమం ద్వారా బ్యాంకింగ్, విమానరంగంకు తీవ్ర ఆర్ధిక నష్టం కల్గించారు. ఒక మిలియన్ దినార్ల విలువ చేసే నకిలీ టికెట్లను విక్రయించాడని పోలీసులు చెప్పారు. ఈ తరహ మోసం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ డాలర్లను తస్కరిచాడు. దుబాయ్ పోలీస్ నేర పరిశోధన శాఖ (సిఐడి) నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మోసగాళ్ళు రెండు రకాల మోసాలను వీరి వలలో పడిన వారిపై ప్రయోగిస్తారు, ఇందులో మొదటిది లేని విమానం టికెట్లను నకిలీ టిక్కెట్లు సృష్టించి వాటిని అమ్మడం... రెండవ మార్గ మోసం ఏమిటంటే, తమ వద్ద ఉన్న వాస్తవమైన విమాన టికెట్లను ఆన్ లైన్ లో చూపించి, ప్రయాణికుల క్రెడిట్ కార్డు నుంచి డబ్బును దొంగిలించడం జరుగుతుందని చెప్పారు. అయెతే రెండవ రకం మోసం లో అంతర్జాతీయ ముఠాలకు స్వదేశంకు చెందిన కొందరు భాగస్వాములు ఉన్నారని ఆయన అన్నారు. ' రండి...త్వరగా కొనండి ..చవక ధరలకు విమాన ప్రయాణం చేయండి ' అంటూ ఇంటర్నెట్ మరియు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ప్రకటనలను తమను ఎంతో ఆకర్షించాయని బాధితులు గగ్గోలు పెడుతున్నారు, వీరి మోసాన్ని గ్రహించి పట్టుకొనేందుకు ఎయిర్లైన్స్, బ్యాంకులు మరియు ఇంటర్పోల్ 60 నుంచి 80 అంతర్జాతీయ సంబంధిత సంస్థలు మధ్య సమన్వయం మరియు సహకారంతో వీరిని ఏకకాలంలోఅరెస్టు చేసినట్లు నివేదిక వెల్లడించింది. తమకు తోబుట్టువుల మాదిరి దళారులు లేరని దయచేసి వారి ఉచ్చులో పడవద్దని లెఫ్టినెంట్ కల్నల్ అల్ హజ్రి సూచించారు. విమాన టికెట్లు పొందాలంటే ప్రయాణికులు నేరుగా సంస్థ కార్యాలయాల ద్వారా పొందాలని లేదా సంస్థ అధికారిక వెబ్సైట్ల ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేయాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







