రాజ్‌భవన్ మహిళా ఉద్యోగులతో టి.గవర్నర్ ముఖాముఖి
- March 08, 2021
హైదరాబాద్:అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై రాజ్‌భవన్ మహిళా ఉద్యోగులతో పాండిచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి నిర్వహించారు. ఈసందర్భంగా గవర్నర్ మహిళలతో ఆప్యాయతతో పలుకరించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నకారణంగా తాను ఈసంవత్సరం మీతో కలిసి సంషాన్ని పంచుకోలేక పోతున్నానని అన్నారు. పలువురు మహిళలు తమిళిసైను అమ్మగా సంబోధిస్తూ మీరు మా మధ్య లేక పోవడం వల్ల మాకు ఎంతో బాధగా ఉందని కొందరు కన్నీళ్లుపెట్టుకున్నారు. నేను ఎంత బిజీగా ఉన్నా మీ క్షేమాన్ని మర్చిపోనని గవర్నర్‌వారికి హామీ ఇచ్చారు.
కొత్త బాధ్యతలు నిర్వహిస్తున్న గవర్నర్‌కు పలువురు మహిళా ఉద్యోగులు శుభా కాంక్షలు తెలిపారు. అలాగే టాప్-20 గ్లోబల్ వుమెన్ ఎక్స్‌లెన్స్-2021 అవార్డు వచ్చినందుకు వారు ససంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వర్నర్ మహిళా ఉద్యోగులనుపేరుపేరుగా పిలిచి వారితో మాట్లాడారు. యోగ క్షేమాలు తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా వారికి తన కార్యదర్శి ద్వారా స్వీట్ బాక్స్‌లు, జూట్‌బ్యాగులను అందజేశారు. కేవలం మహిళా అధికారులే కాదు,పారిశుద్ధ్య పనివాళ్లు, గార్డెనింగ్ చేసేవారు, వ్యక్తిగత ఉద్యోగులు ప్రతి ఒక్కరితో గవర్నర్ మాట్లాడారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …