షార్జా లో పాదాచారులకు ఐదు వంతెనలు

- February 28, 2016 , by Maagulf
షార్జా లో పాదాచారులకు ఐదు వంతెనలు

ఎమరేట్స్ లో వేర్వేరు ప్రాంతాల్లో ఐదు పాదచారుల వంతెనలు  నిర్మించాలని  షార్జా పట్టణ ప్రణాళిక మండలి   (షార్జా అర్బన్ ప్లానింగ్ కౌన్సిల్) ఆమోదించింది.  షార్జా రహదారులు మరియు రవాణా సంస్థ సహకారంతో,  ఐదు పాదచారుల వంతెనలు నమూనాలు రూపొందంచాబడ్డాయి. ఈ ఐదు పాదచారుల వంతెనలు ఏమిటంటే ,  కింగ్ ఫైసల్ రోడ్డు, కింగ్ అబ్దుల్ అజిజ్ వీధి , అల్ ఇట్టిహాడ్ రోడ్ మరియు అల్ తావున్ రోడ్డు రద్దీగా ఉన్న ప్రాంతాలలో ఇవి  నిర్మించబడనున్నాయి. ఈ వంతెనలు ప్రత్యేక అవసరాలు ఉన్న వృద్ధ మరియు ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించనున్నాయి.  లిఫ్టులు మరియు కాలి బాటలు వంతెనకు బిగించి ఉంటుంది. షార్జా పట్టణ ప్రణాళిక మండలి చైర్మన్, షేక్ ఖలీద్ బిన్ సుల్తాన్ అల్ క్యసిం ఈ సందర్భంగా మాట్లాడుతూ షార్జ ఎమిరేట్ లో పౌరులు, నివాసితులు మరియు సందర్శకులు కోసం  నాణ్యతతో కూడిన  సేవలను అందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ,అలాగే , ఈ ఐదు పాదాచారుల వంతెనల నిర్మాణ విషయంలో "మేము స్థిరంగా మద్దతు పలుకుతున్నామని , ఈ రకమైన ప్రాజెక్టుల వలన ఎంతో ఆకర్షణీయం కలిగి ఉంటాయని అన్నారు. వీటిని షార్జా పట్టణ ప్రణాళిక మండలి పటిష్టంగా రూపొందించడంలో ఎంతో ముఖ్య ప్రాధాన్యత ఉంది.షార్జా నగరంలో ప్రధాన రహదారులు వద్ద పాదచారుల భద్రత మెరుగుపడే విధంగా వీటి  ప్రయోజనం ఉంటుందని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com