ఈవెంట్లకు హాజరయ్యే అతిథులు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే

- March 09, 2021 , by Maagulf
ఈవెంట్లకు హాజరయ్యే అతిథులు పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే

అబుధాబి:అబుధాబిలో నిర్వహించే ఏ ఈవెంట్లకు సంబంధించి కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది పాలనా యంత్రాంగం. బిజినెస్, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు వెళ్లాలనుకునే వారు ఖచ్చితంగా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సిందేనని ఆదేశించింది. ఈవెంట్ కు వెళ్లే 48 గంటలలోపు పీసీఆర్ టెస్ట్ రిపోర్ట్ లను మాత్రమే పరిగణలోకి తీసుకోనున్నట్లు వివరించింది. అలాగే ఈవెంట్ నిర్వాహకులు కూడా పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాలని సూచించింది. వారంపైగా నిర్వహించే ఈవెంట్లైతే ప్రతి ఏడు రోజులకు ఓ సారి పీసీఆర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈవెంట్లకు సంబంధించి ఎంత మందికి అనుమతి ఇవ్వాలనేది కూడా అబుధాబి పాలనా యంత్రాంగం ఖరారు చేసింది. ప్రైవేట్ బీచులు, స్విమ్మింగ్ పూల్స్ లో 60 శాతం, బిజినెస్ ఈవెంట్లకు 50 శాతం, ఎంటర్టైన్మెంట్ ఈవెంట్లకు పూర్తి సామర్థ్యంలో 30 శాతం మందికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తే నిర్వాహకులు కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com