'ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌'లో ఉద్యోగాలు..

- March 09, 2021 , by Maagulf
\'ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌\'లో ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. kyungshin industrial motherson pvt ltdలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేశారు. మొత్తం 280 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధులు ఈ నెల 11లోగా రిజిస్టర్ చేయించుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులు అనంతపురం జిల్లా, హిందూపూర్‌లోని సంస్థ కార్యాలయంలో పని చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధులకు రవాణా సౌకర్యంతో పాటు, ఉచిత భోజన సదుపాయం కూడా ఉంటుందని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టులన్నింటికీ కేవలం పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో తెలిపారు.

ప్రకటనకు సంబంధించిన వివరాలు.. Associates Special Trainees: ఈ విభాగంలో మొత్తం 200 ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ విద్యార్హత ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. వయసు 18-28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.8,800 వరకు వేతనం చెల్లిస్తారు. Diploma (Operator&Engineer): ఈ విభాగంలో మొత్తం 50 ఖాళీలున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ విభాగంలో డిప్లొమా చేసిన వారు అప్లై చేసుకునేందుకు అర్షులు. ఎంపికైన వారికి నెలకు రూ.10,500 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు వయసు 18-28 ఏళ్లు ఉండాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com