బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!

- September 24, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!

మనామా: బహ్రెయిన్ లో డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న వివిధ దేశాలకు చెందిన 19 మంది వ్యక్తులను జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫోరెన్సిక్ సైన్స్‌ లోని యాంటీ-నార్కోటిక్స్ డైరెక్టరేట్ అరెస్టు చేసిందని తెలిపింది. నిందితుల వద్ద నుంచి  మొత్తం 16 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారని, వీటి విలువ 1 లక్ష 13వేల బహ్రెయిన్ దినార్ల కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. నమోదైన కేసులను పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు సూచించినట్టు వెల్లడించింది. 

మాదకద్రవ్యాల అక్రమ రవాణా లేదా ప్రమోషన్‌కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని హాట్‌లైన్ (996) ద్వారా లేదా [email protected] కు ఇమెయిల్ ద్వారా తెలియజేయాలని కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com