ఉత్తమ డ్రైవింగ్ పై హస్త పుస్తకం విడుదల

- February 28, 2016 , by Maagulf
ఉత్తమ డ్రైవింగ్ పై  హస్త పుస్తకం విడుదల

                        

 రవాణా శాఖ రచించి  విడుదల చేసిన చేతి పుస్తకంకు మంచి ఆదరణ లభిస్తుంది. సురక్షితంగా డ్రైవ్ ఎలా  చేయాలి ? ట్రాఫిక్ ఉల్లంఘనలు..అన్ని రకాల జరిమానాలు.. మంచి స్థితిలో  వాహనం ఎలా  ఉంచాలి  సహా వివిధ అంశాలపై కూలంకుషంగా ఈ పుస్తకంలో పొందుపరిచారు.అంతర్గత మంత్రిత్వశాఖకు  రవాణశాఖ అందచేసిన ఈ పుస్తకంకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఈ చేతి పుస్తకాన్ని దేశంలో ఉన్నఅన్ని డ్రైవింగ్ పాఠశాలలో పాతాలుగా నేర్పించేలా ఒక ఏకీకృత పాఠ్యప్రణాళిక కొరకు అందిస్తుందాని , స్థానిక అరబిక్  ఆర్రయహ్ దినపత్రిక నివేదించింది. దేశవ్యాప్తంగా పాఠశాలలు చురకైన శిక్షణను ఈ సమగ్ర హస్త పుస్తకం ద్వారా అందించబడుతుంది. కొత్తగా డ్రైవింగ్ నేర్చుకొనేవారికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు  పేర్కొంటున్నారు.ట్రాఫిక్ నిపుణుడు హసన్ నస్సర్   హ్యాండ్బుక్ ట్రాఫిక్ చట్టం మరియు దాని ఎగ్జిక్యూటివ్ నియమాలకు అనుగుణంగా ఉంది ప్రతి నిత్యం చదవాల్సిన పుస్తకమని ఆయన చెప్పారు. కేవలం డ్రైవింగ్ సూచనల మీద అమూల్యమైన సమాచారం ఇవ్వడమే కాక     ట్రాఫిక్ అవగాహన వివిధ అంశాలపై వివరించడం బాగుందని అన్నారు.ఆకస్మిక వైఫల్యాలు నివారించడానికి బాగా సంరక్షించిన కారు ఉంచడానికి, మరియు ఎలా ఉపయోగించాలో వివిధ వాతావరణ పరిస్థితుల్లో డ్రైవింగ్, భద్రతా సామగ్రి సూత్రాలను సంబంధించిన అన్ని విషయాలను చర్చించడం ఎంతో బాగుందని పలువురు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com