ఘోర బస్సు ప్రమాదం…27 మంది మృతి
- March 11, 2021
జకార్తా:ఇండోనేషియాలో ఘోర ప్రమాదం సంభవించింది. జావాలో పర్యాటక బస్సు లోయలో పడిన ఘటనలో27 మంది యాత్రికులు మృతి చెందారు. మరో 35 మంది గాయపడ్డారు. బస్సు బ్రేకులు ఫేయిల్ కావడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
తీర్థయాత్ర కోసం బస్సులో పశ్చిమ జావా దీవుల్లోని సుమేదంగ్ జిల్లాలోని పుణ్యక్షేత్రం సందర్శనకు వచ్చారు. బస్సు వేగంగా నడుపుతుండగా బ్రేకులు ఫెయిలై 65 అడుగుల లోతున్న లోయలోకి పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో 27 మంది మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని క్రేన్ల సాయంతో కాపాడి అంబులెన్సులో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో పిల్లలున్నారని ఇండోనేషియా అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







