BDLలో ఉద్యోగావకాశాలు
- March 11, 2021
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ప్రాజెక్టు ఆఫీసర్ విభాగంలోని ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఉద్యోగ ఖాళీల వివరాలు..
ప్రాజెక్టు ఇంజనీర్ విభాగంలో 55 పోస్టులు, ప్రాజెక్టు ఆఫీసర్ విభాగంలో15 పోస్టులు ఉన్నాయి. ఇందులో ప్రాజెక్టు ఇంజనీర్ విభాగంలో 55 పోస్టులు, ప్రాజెక్ట్ ఆఫీసర్ విభాగంలో 15 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, ఎంబీఏ, పీజీడిప్లొమా కలిగిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల వయస్సు 28 ఏళ్లకు మించకుండా ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
అలాగే ప్రాజెక్టు ఆఫీసర్ ఉద్యోగాలకు నెలకు రూ. 30 వేల నుంచి రూ. 33 వేల వరకు ఉంటుందని, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాలకు నెలకు రూ.36 వేల నుంచి రూ.39 వేల వరకు వేతనం ఉంటుందని తెలిపింది.
ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
అర్హత కలిగిన అభ్యర్థులు http://www.bdl-india.in వెబ్ సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారికి ఏవైనా సందేహాలుంటే [email protected]కు ఈ మెయిల్ చేయాలని ప్రకటనలో సూచించారు.
తాజా వార్తలు
- ఫేక్ డాక్యుమెంట్లతో సిమ్ తీసుకుంటే జైలే..!!
- నకిలీ ‘కన్స్యూమర్ ప్రొటెక్షన్’ లింక్‌ల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- కార్వ్ సంస్థకు 4 మిలియన్ డాలర్ల కమిట్మెంట్
- అమరావతిలో మరో ఐకానిక్ నిర్మాణం APNRT టవర్!
- దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీలకు గ్రీన్ సిగ్నల్..
- ఖమ్మంలో డీజీపీ సి.వి.ఆనంద్ క్రైమ్ సమీక్ష..'బ్యాక్ టు బేసిక్స్'తో సమర్థ పోలీసింగ్‌కు పిలుపు
- భారత్ ను చూసి ఇండోనేషియా ఎంతో నేర్చుకోవాలి: ఇండోనేషియా ప్రెసిడెంట్
- పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం..దక్షిణ కొరియాలో మంత్రి లోకేశ్ బిజీ షెడ్యూల్
- ఖతార్ లో భవిష్యత్ ఉద్యోగ అవసరాలకు అనుగుణంగా స్కాలర్షిప్లు..!!
- ప్యాకేజ్ వీసా.. సౌదీ ప్రయాణం మరింత సులభం..!!







