హజ్ మంత్రిగా ఎస్సమ్ బిన్ సయీద్ నిమామకం
- March 13, 2021
సౌదీ అరేబియా:సౌదీ అరేబియా హజ్ మంత్రి పదవిలో మార్పులు చేర్పులు జరిగాయి. ప్రస్తుత హజ్, ఉమ్రా మంత్రిగా ఉన్న మొహమ్మద్ బెన్తెల్ రిలీవ్ చేశారు. అతని స్థానంలో ఎస్సమ్ బిన్ సయీద్ ను నిమమించారు. సౌదీ అరేబియాలోని రెండు పవిత్ర మసీదులు మక్కా, మదీనా సంరక్షకుడిగా ఉన్న సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఈ ఏడాది హజ్ యాత్రకు వచ్చే భక్తులకు సంబంధించి సౌదీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. కోవిడ్ నేపథ్యంలో గతేడాది కేవలం స్థానిక భక్తులకు అదీ కూడా 10 వేల మందికి మాత్రమే అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఎంత మంది భక్తులకు అవకాశం కల్పిస్తారు...విదేశాల నుంచి వచ్చే హజ్ యాత్రికులను అనుమతిస్తారా అనేది ఉత్కంఠ నెలకొంది. అయితే..గతంలో ప్రభుత్వం నుంచి వచ్చిన సంకేతాల మేరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







