రోజుకు ఒక పరీక్ష మాత్రమే నిర్వహించాలని ఆదేశాలు
- March 13, 2021
షార్జా:విద్యార్ధులపై పరీక్ష ఒత్తిడులు సరికావని తేల్చిచెప్పిన షార్జా అధికారులు..ఇక నుంచి ఎమిరాతి పరిధిలోని స్కూళ్లలో రోజుకు ఒక పరీక్షకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు ఆదేశాలు చేసింది.ఎమిరేట్ పరిధిలోని ఏ స్కూల్ లోనూ ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించొద్దని స్పష్టం చేసింది. ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించం ద్వారా తమ పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారని ఓ విద్యార్ధి తల్లి షార్జా రూలర్ కు ఫిర్యాదు చేసింది. రెండు పరీక్షలను ఒకే రోజు నిర్వహించటం వల్ల పిల్లల చదువు భారం ఎక్కువ అవుతోందని, ఈ ఆందోళన..ఒత్తిడి వాళ్ల ప్రతిభపై ప్రతికూల ప్రభావం చూపుతోందని..కొందరు విద్యార్ధులు అయితే ఫెయిల్ అవుతామనే భయంలో ఉంటున్నారని ఆమె రూలర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన షార్జా రూలర్ వెంటనే షార్జా ప్రైవేట్ ఎడ్యూకేషన్ అథారిటీతో మాట్లాడి స్కూల్స్ లో ఒకే రోజు రెండు పరీక్షలు నిర్వహించకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







