రేపే షాబాన్ మొదటి రోజు..సౌదీ ప్రభుత్వం ప్రకటన
- March 14, 2021
సౌదీ:రమదాన్ కి ముందు వచ్చే షాబాన్ మాసం సోమవారం నుంచే ప్రారంభం అవుతుందని సౌదీ అరేబియా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. నిజానికి నెలవంక కనిపించిన తర్వాత షాబాన్ మాసపు తొలి ఉపవాస దీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే..దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దుమ్ముతో కూడిన వాతావరణం, ఇసుక తుఫాన్ కారణంగా నెలవంక కనిపించలేదని వెల్లడించింది. సౌదీ రాజధాని రియాద్ తో పాటు ఖాసిమ్, అల్ జల్ఫ్ దుమ్ము వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అలాగే..మక్కా, మదీనా తూర్పు భాగాలతో సహా దేశంలోని ఉత్తర ప్రాంతంలోనూ దుమ్ము తుఫాను చెలరేగింది. అయితే..ఒమన్, మలేషియా దేశాలు ఆదివారమే హిజ్రి నెల రజబ్ చివరి రోజుగా ప్రకటించాయి. సోమవారం నుంచి షాబాన్ మాసపు తొలిరోజు ప్రారంభం అవుతుందని వెల్లడించాయి. దీంతో కింగ్డమ్ లోనూ సోమవారం నుంచే షాబాన్ ప్రారంభం అవుతుందని సౌదీ అరేబియా ప్రకటించింది.
తాజా వార్తలు
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో "జీరో" శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!
- BIC ఈవెంట్లకు మెడికల్ సపోర్ట్..!!
- వాట్సప్ గవర్నెన్స్ తో 751 పౌరసేవలు
- కెనడాలో ఖలిస్థానీ కీలక నేత అరెస్ట్
- ట్రంప్ నిర్ణయాలు..ఇతర దేశాల్లోనూ మెరుగైన అవకాశం
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు …