వలస కార్మికుల హౌసింగ్ కాంప్లెస్ కోసం 8 సైట్ల కేటాయింపు
- March 14, 2021
కువైట్: వలస కార్మికులకు నివాస సదుపాయం కల్పించేందుకు కువైట్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వలస కార్మికుల గృహ సముదాయాలను నిర్మించేందుకు అహ్మదీ, అల్-జహ్రా గవర్నరేట్లలో 8 సైట్లను కేటాయిస్తూ కువైట్ మున్సిపాలిటీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆమోదం తెలిపింది. అయితే..గృహ సముదాయాల నిర్మాణానికి అవసరమైన తుది అనుమతుల కోసం త్వరలోనే మున్సిపల్ పాలక మండలికి సిఫార్సు చేయనున్నట్లు మున్సిపాలిటీ అధికారులు వెల్లడించారు. మొత్తం నాలుగు అంతస్తులు వలస కార్మికులకు కేటాయిస్తామని, మిగిలిన రెండు ఫోర్లతో పాటు బేస్మెంట్ ను మౌళిక సదుపాయాలు, ఇతర సేవల కోసం వినియోగించనున్నట్లు అధికారులు వెల్లడించారు. గృహ సముదాయాల్లో 5 శాతం ప్రాంతాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు