ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి:సీపీ వీసీ సజ్జనార్

- March 14, 2021 , by Maagulf
ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి:సీపీ వీసీ సజ్జనార్

హైదరాబాద్:గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ/ పట్టభద్రుల ఎన్నికల సందర్భంగా ఈరోజు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాదాపూర్ డిసిపి వెంకటేశ్వర్లు, కూకట్పల్లి ఏసీపీ సురేందర్, కూకట్పల్లి ఇన్ స్పెక్టర్ నర్సింగ్ రావు ఇతర పోలీస్ అధికారులతో కలిసి మాదాపూర్ జూన్ లోని పలు పోలింగ్  కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. 

మాదాపూర్ జోన్ లోని కూకట్పల్లి లోని 8 పోలింగ్ స్టేషన్లు, కేపిహెచ్ బి లోని 7 పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు. ముందుగా కూకట్ పల్లి లోని జిల్లా పరిషద్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్ ను సందర్శించారు. 

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు.రంగారెడ్డి, మేడ్చల్- మల్కాజ్ గిరి, హైదరాబాద్ జిల్లా లలో ఉన్న 66 పోలింగ్ లొకేషన్లలో 180 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. 1,22,744 మంది ఓటర్లు ఉన్నారన్నారు. 

ఓటర్లందరూ ఓటు వేసేందుకు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారన్నారు. 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న ప్రతీ గ్రాడ్యుయేట్ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటు ద్వారా ప్రజాస్వామ్యాన్ని గెలిపించండని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈరోజు ఎన్ని ఇతర పనులు ఉన్నప్పటికీ పట్ట భద్రులందరూ కచ్చితంగా తమ అమూల్యమైన ఓటు వేసేందుకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఓట్ ఫస్ట్, వర్క్ నెక్స్ట్ అన్నారు. గ్రాడ్యూయేట్ లు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొని ఓటింగ్ శాతాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. 
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్ల్ ల వద్ద ఏమైనా ఇబ్బంది ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు.


కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గ్రాడ్యూయేట్ లు ఓటింగ్ లో పాల్గొంటున్నారన్నారు. 
పోలింగ్ స్టేషన్ల వద్ద ఏర్పాటు చేసిన ఓటర్లకు తాగునీరు, టెంట్లు, వృద్ధులకు వీల్ ఛైర్స్ తదితర వసతులు పట్ల సీపీ సంతృప్తి వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com