ప్రైవేటీకరిస్తాం.. స్టీల్ ప్లాంట్‌పై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు

- March 15, 2021 , by Maagulf
ప్రైవేటీకరిస్తాం.. స్టీల్ ప్లాంట్‌పై నిర్మలమ్మ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామని కేంద్రం తేల్చి చెప్పింది. లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ.. నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా.. రూ.1.75 లక్షల కోట్లు సమీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో నష్టాలు రావడానికి అనేక కారణాలున్నాయని, రుణ భారం పెరగడం, తక్కువ ఉత్పాదకత ముఖ్యకారణాలని తెలిపారు. అందుకే విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.

కేంద్రం పట్టువిడుపు లేకుండా ముందుకు వెళుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఆంధ్రుల మనోభావాలకు విలువ లేకుండా పోయిందని వాపోతున్నారు. చేస్తానన్నవి చేయకుండా... హక్కుతో సాధించుకున్నదాన్ని లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. 32 మంది ప్రాణత్యాగాలకు విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com