పగటి పూట జనసందోహంపై ఆరోగ్య శాఖ అధికారుల హెచ్చరికలు
- March 16, 2021
కువైట్: సాయంత్రం 5 గంటల నుంచి తెల్లవారు ఝామున 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ అమల్లో వున్నప్పటికీ, ఉదయం పూట ఎక్కువమంది జనం ఒకే చోట వివిధ కారణాలతో పోగవుతుండడం వల్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎలాంటి లక్షణాలూ బయటపడకుండానే కరోనా వైరస్ కలిగి వున్న వ్యక్తులు ఇతరులకు వ్యాధిని వ్యాపింపజేస్తున్నారని, ఆ కారణంగానే కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. ఒకే వాహనంలో బృందంగా ఎక్కువమంది ప్రయాణించే సందర్భంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరగడానికి ఆస్కారం వుంటుందని అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం సమావేశాలకు అవకాశాలు తక్కువ వుండడంతో అవి పగటిపూట ఎక్కువ జరిగి, కరోనా వ్యాప్తికి కారణమవుతున్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







