రెస్టారెంట్ల వద్ద ఇప్తార్ మీల్ పంపిణీపై నిషేధం
- March 16, 2021
రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా పోలీస్ విభాగం, రెస్టారెంట్ల లోపల, రెస్టారెంట్ల వెలుపల ఇప్తార్ మీల్స్ పంపిణీపై నిషేధం విధించింది. పవిత్ర రమదాన్ మాసంలో ఇఫ్తార్ మీల్స్ పంపిణీ అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అయితే, ఇళ్ళ బయట కూడా ఇఫ్తార్ మీల్స్ పంపిణీ చేయడానికి వీల్లేదని అధికారులు స్పష్టం చేశారు. రెసిడెన్షియల్ లేబర్ కాంప్లెక్సుల్లో ఇఫ్తార్ మీల్స్ పంపిణీకి అనుమతి వుంది. అయితే, బాక్సులు లేదా బ్యాగులలో మాత్రమే వాటిని పంపిణీ చేయాల్సి వుంటుంది. సోషల్ డిస్టెన్సింగ్ ప్రతి ఒక్కరూ పాటించాలని పోలీసులు హెచ్చరించారు. కరోనా నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. దుబాయ్, షార్జా అలాగే అజ్మన్ తదితర ప్రాంతాల్లో రమదాన్ టెంట్ పర్మిషన్లు కూడా రద్దు చేసిన విషయం విదితమే. ఏప్రిల్ 13 నుంచి రమదాన్ ప్రారంభం కానుంది.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







