వ్యాక్సిన్ పై ఎవరిష్టం వారిది..ప్రవాసీయుల ఎంట్రీపై ఎటూ తేల్చని కువైట్
- March 16, 2021
కువైట్: దేశవ్యాప్తంగా పాక్షిక కర్ఫ్యూ విధించినా కువైట్లో కోవిడ్ తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇంటెన్సిటీవ్ కేర్ యూనిట్లలో చికిత్స పొందుతున్న వైరస్ బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సమావేశమైన కువైట్ మంత్రి మండలి కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో మాత్రం చెప్పుకోదగ్గ నిర్ణయాలు తీసుకోలేదు. దీంతో ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాలే కొనసాగనున్నాయి. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవటం తప్పనిసరి చేసే అవకాశాలు ఉన్నట్లు అంతా అనుకున్నారు. కానీ, మంత్రిమండలి అలాంటి నిర్ణయమేది తీసుకోలేదు. ఆంక్షల సమయం పెరుగుతుందని అంచనాలు విన్పించిన విషయం తెలిసిందే. అలాగే కర్ఫ్యూ సమయంలో రెస్టారెంట్లకు ఫుడ్ డెలివరీ అవకాశం కల్పిస్తారని అంతా భావించారు. కానీ, మంత్రివర్గం మాత్రం అలాంటి నిర్ణయాలు ఏం తీసుకోలేదు. అలాగే ప్రవాసీయలు ఎంట్రీపైనా మంత్రిమండలి ఎటూ తేల్చలేదు. కానీ, ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన టీచర్ల రాకపై విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకుంటుందని మాత్రం వెల్లడించింది.
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు