భారత రాయబారితో ఒమన్ ఆరోగ్యశాఖ మంత్రి సమావేశం

- March 16, 2021 , by Maagulf
భారత రాయబారితో ఒమన్ ఆరోగ్యశాఖ మంత్రి సమావేశం

ఒమన్: ఒమన్ లోని భారత రాయబారి మును మహవర్ తో ఒమన్ ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైదీ సమావేశం అయ్యారు. మంత్రిత్వ శాఖ కార్యాలయం వెల్లడించిన వివరాల మేరకు భారత రాయబారిని..డాక్టర్ అహ్మద్ సాదరంగా స్వాగతించారు. ఈ సమావేశం మర్యాదపూర్వక సమావేశమని కార్యాలయం వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో ఇరు స్నేహ దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలపడాలని ఇరువురు ఆకాంక్షించినట్లు తెలిపాయి. ప్రధానంగా ప్రస్తుత కోవిడ్ సంక్షోభ సమయంలో పరస్పర సహకారం అవశ్యకత ఉందని అభిప్రాయపడ్డారని పేర్కొన్నాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com