ప్రయాణికుల కోసం ఈ-పోర్టల్ ప్రారంభించిన సౌదీ ఏవియేషన్

- March 17, 2021 , by Maagulf
ప్రయాణికుల కోసం ఈ-పోర్టల్ ప్రారంభించిన సౌదీ ఏవియేషన్

సౌదీ:ప్రయాణికులకు మరింత నాణ్యమైన సేవలను అందించేందుకు సౌదీ సివిల్ ఏవియేషన్ ఈ-పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకొని పోర్టల్ సేవలను ప్రారంభించింది. ఈ-పోర్టల్ ద్వారా సౌదీ పౌర విమానయాన సంస్థ ప్రయాణికులకు మరింత చేరువ కానుంది. వినియోగదారులకు సంతృప్తికర సేవలను అందించటం, సర్వీస్ లో క్వాలిటీ పెంచటమే ఈ-పోర్టల్ లక్ష్యం. వినియోగదారులు తమకు కావాల్సిన సమాచారాన్ని, ప్రయాణ వివరాలను, తమ అందాల్సిన సేవలను డిజిటల్ సహాయంతో క్షణాల్లోనే పొందవచ్చు. ట్విట్టర్ ద్వారా ఆటోమెటిక్ రెస్పాన్స్ వచ్చేలా ఈ-పోర్టల్ టెక్నాలజీ వినియోగదారులకు సేవలు అందించనుంది. అలాగే 8001168888 నెంబర్ ద్వారా సుక్షితులైన సిబ్బంది వినియోగదారులకు తగిన సమాచారం అందిస్తుంది. అలాగే వినియోగదారుల హక్కులకు భంగం కలిగినప్పుడు ఈ ప్రత్యేక సర్వీస్ నెంబర్ ద్వారా అభ్యంతరాలను వ్యక్తం చేసి తగిన సేవలను పొందవచ్చు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com