అటెండెన్స్ రికార్డు రిగ్గింగ్: హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జైలు

- March 17, 2021 , by Maagulf
అటెండెన్స్ రికార్డు రిగ్గింగ్: హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు జైలు

బహ్రెయిన్: హై క్రిమినల్ కోర్టు, హెల్త్ మినిస్ట్రీ ఉద్యోగులకు ఏడాది శిక్ష విధించింది. అటెండెన్స్ రికార్డుల్లో అవకతవకలకు నిందితులు పాల్పడినట్లు విచారణలో తేలింది. ఓవర్ టైమ్ పని గంటల విషయమై నిందితులు టాంపరింగ్ చేశారు. ఈ క్రమంలో నిందితులు కొంత మొత్తాన్ని లంచంగా పొందారు. 1,900 బహ్రెయినీ దినార్ల నుంచి 600 బహ్రెయినీ దినార్ల వరకు నిందితులు లంచగంగా పొందినట్లు తేలింది. వారు తీసుకున్న సొమ్ముల్ని తిరిగి చెల్లించాల్సిందిగా నిందితుల్ని ఆదేశించింది న్యాయస్థానం. అదే సమయంలో, అదే మొత్తానికి నిందితులకు జరీమానా కూడా విధించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com